చాలా మంది డార్క్ సైకాలజీ అనే పదాన్ని విని, దాని అర్థం ఇతరులను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం అని అనుకుంటారు. వాస్తవానికి, మానసిక విజ్ఞానం యొక్క అత్యంత శక్తివంతమైన ఉపయోగం ఏమిటంటే, మిమ్మల్ని మీరు ఇతరుల మోసం నుండి కాపాడుకోవడం మరియు మీ ప్రతిచర్యలను మీరే నియంత్రించుకోవడమే అని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తుంది.
రోజువారీ జీవితంలో ప్రజలు ఒత్తిడి, భావోద్వేగాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. ఎవరైనా మిమ్మల్ని ఒక నిర్ణయం తీసుకోవడానికి తొందరపెట్టేవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు కోరుకున్నది పొందడానికి మీలో అపరాధభావనను కలిగిస్తారని గుర్తించాలి. వారి అభిప్రాయాన్ని ప్రశ్నించకుండా అంగీకరించి.. ఆత్మవిశ్వాసంతో మాట్లాడితే నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
మానసిక నమూనాలను అర్థం చేసుకున్నప్పుడు, నిజ జీవిత పరిస్థితులలో వాటిని గమనించడం ప్రారంభిస్తారు. భావోద్వేగంతో ప్రతిస్పందించే బదులు.. కొద్దిసేపు ఆగి గమనించాలి. మీరు జాగ్రత్తగా ఇతరులు చెప్పినది విని... ప్రజల ప్రవర్తనను గమనించి.. ప్రతిస్పందించే ముందు ఆలోచించాలి.ఇలా చేయడం ప్రశాంతత లభిస్తుంది. ఇలా చేయడం వలన ఇతరులు చెప్పిన విషయాలు నష్టం కలిగేలా ఉంటే.. అలాంటి వాటిని చేయకుండా ఉండేలా నిరోధిస్తుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. డార్క్ సైకాలజీ ప్రకారం జనాలు వాటిపట్ల ఆకర్షితులవుతున్నారు. కొంతమంది వ్యాపార సంస్థగా మార్చుకొని వారి అభిప్రాయాలు.. ఇతరులపై ప్రభావం చూపేలా చేస్తున్నారు.
డార్క్ సైకాలజీ అనేది అధికారిక శాస్త్రం కానప్పటికీ డీకోడ్ చేసే నిజమైన పనిగా రూపొందిస్తారు. ఆన్‌లైన్ వ్యవస్థలో మానిప్యులేషన్ అనేది ప్రమాదకరంగా మారుస్తుంది. డార్క్ సైకాలజీ సీక్రెట్స్, ది ఆర్ట్ ఆఫ్ మానిప్యులేషన్ చాలా వరకు ఇతర వ్యక్తులను .. వారి ఇష్టానికి వంచడంలో సహాయపడేలా చేయడమేనని విశ్లేషకులు చెబుతున్నారు,
