
మలయాళ నటి అయినా పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది దర్శన రాజేంద్రన్. ప్రస్తుతం తెలుగులోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. మంగళవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తను నటిస్తున్న టాలీవుడ్ ప్రాజెక్ట్ ‘పరదా’ నుంచి స్పెషల్ పోస్టర్‌తో పాటు తన క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ బర్త్‌డే విషెస్ తెలియజేశారు మేకర్స్. ఇందులో అమిష్టి పాత్రలో దర్శన కనిపించబోతున్నట్టు రివీల్ చేశారు. ట్రెడిషనల్ గెటప్‌లో ఉన్న తన లుక్ ఆకట్టుకుంటోంది.
తనతో పాటు అనుపమ పరమేశ్వరన్, సంగీత ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. హృదయాన్ని కదిలించే ఈ కథ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మేకర్స్ తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.