కత్రినా ఐటం సాంగ్ కు డేవిడ్ వార్నర్ చిందులు

కత్రినా ఐటం సాంగ్ కు డేవిడ్ వార్నర్ చిందులు

ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ గురించి తెలియని వాళ్లుండరు. ఎందుకుంటే ఆయన సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా కూడా ఉన్నాడు. తాజాగా.. ఆయన తన కూతురు ఇండితో కలిసి బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ హిట్ సాంగ్ ‘షీలా కీ జవానీ’ సాంగ్ ను టిక్ టాక్ లో చేశారు. ఆ వీడియోను ఆయన తన ఇన్ స్ట్రాగ్రాంలో పోస్టు చేశారు. ఆ వీడియో అలా పోస్టు అయిందో లేదో గంటలో 2,50,000 మంది వీక్షకులు చూశారు. ప్రస్తుతానికి అయితే ఆ వీడియో దాదాపు పది లక్షల మంది చూశారు. ఆస్ట్రేలియన్ గాయకుడు మరియు పాటల రచయిత టోని వాట్సన్ పాడిన నెవర్ సీన్ ది రెయిన్ అనే పాట ద్వారా వార్నర్ టిక్ టాక్ లోకి ప్రవేశించాడు.

వార్నర్ ఈ సీజన్ ఐపీఎల్ 2020 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా లాక్డౌన్ వల్ల ఈ సీజన్ ఐపీఎల్ వాయిదా పడింది. ఈ ఏడాది ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ గురువారం ధృవీకరించింది. ఐపీఎల్ 2020 మార్చి 29న ప్రారంభమవ్వాలి కానీ.. లాక్డౌన్ వల్ల ఏప్రిల్ 15 వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత లాక్డౌన్ ను మే 3 వరకు పొడిగించడంతో మరింత ఆలస్యమవుతుందని బీసీసీఐ ప్రకటించింది.

For More News..

పట్టణ పేదలకు రూ. 100 కోట్లు కేటాయించిన ఒడిశా ప్రభుత్వం

ఏప్రిల్ 21 నుండి అన్ని కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాసెస్

వీడియో వైరల్: ఫోన్ చేస్తే ఇంటికొచ్చి బర్త్ డే చేసిన పోలీసులు