వందో టెస్టులో డబుల్ సెంచరీ కొట్టిన వార్నర్

వందో టెస్టులో డబుల్ సెంచరీ కొట్టిన వార్నర్

మెల్ బోర్న్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్  డేవిడ్ వార్నర్ చెలరేగిపోయాడు. ఏకంగా డబుల్ సెంచరీ కొట్టాడు. 254 బంతులను ఎదురుకున్న వార్నర్.. 2 సిక్సర్లు, 16 ఫోర్ల  సహయంతో  200 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.  న‌డ‌వ‌టానికి కూడా ఇబ్బంది ప‌డ్డ  వార్నర్  ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. కాగా ఈ టెస్టు వార్నర్ కు 100 టెస్టు కావడం విశేషం. వందో టెస్టు మ్యాచ్ లోడబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా వార్నర్ నిలువగా, తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

అంతకుముందు  ఈ ఘనతను ఇంగ్లండ్‌ క్రికెటర్ రూట్‌ 2021 లో సాధించాడు. భారత్‌పై రూట్‌ తన వందో టెస్టులో  218 పరుగులు చేశాడు. ఇక ఆస్ట్రేలియా త‌న మొద‌టి ఇన్నింగ్స్‌లో 82 ఓవ‌ర్లలో 3 వికెట్ల న‌ష్టానికి 368 ర‌న్స్ చేసింది. ప్రస్తుతం అలెక్స్ కారే (3), ట్రావియస్‌ హెడ్‌(37) పరుగులతో  క్రీజ్ లో ఉన్నారు. అటు దక్షిణాఫ్రికా తన మొద‌టి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలౌట్ అయింది.