పాజిటివ్ టాక్తో డీసీ

పాజిటివ్ టాక్తో డీసీ

దర్శకుడిగా పలు సూపర్ హిట్స్ తీసిన లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన చిత్రం ‘డీసీ’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో   సన్ పిక్చర్స్ సంస్థ  నిర్మించింది. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయిన్స్. శుక్రవారం ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగులో విడుదలైంది.

ఫస్ట్ షో నుంచే పాజిటివ్ మౌత్ టాక్‌‌తో దూసుకెళ్తోందని తెలియజేస్తూ డిస్ట్రిబ్యూటర్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా హక్కులు మాకు ఇచ్చిన సన్ పిక్చర్స్‌‌కు ధన్యవాదాలు.  విడుదలైన అన్ని సెంటర్స్‌‌లో   విజయవంతంగా ప్రదర్శితమవుతూ  బ్లాక్‌‌బస్టర్ హిట్‌‌గా నిలిచింది’ అని అన్నారు.

సురేష్ బాబు మాట్లాడుతూ ‘సినిమాకు అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నాయి.  ఏషియన్ సునీల్ గారు, దిల్ రాజు గారు, మేమంతా కలిసి ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాం.  అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.  సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనేది ఈ సినిమా మరోసారి నిరూపించింది’ అని చెప్పారు.  శిరీష్ రెడ్డి మాట్లాడుతూ ‘అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. స్క్రీన్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ విజయం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అని అన్నారు.