బెయిర్ స్టో బాత్రూమ్‌లో ఉన్నాడా?

బెయిర్ స్టో బాత్రూమ్‌లో ఉన్నాడా?

ముంబై: సన్‌‌‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌‌లో ఎస్‌ఆర్‌‌హెచ్ ఓడిపోయింది. అయితే సూపర్ ఓవర్‌లో హిట్టర్ బెయిర్ స్టోను పంపకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్ఆర్‌‌హెచ్ నిర్ణయం సరికాదని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌‌ మండిపడ్డాడు. 

‘బెయిర్ స్టో బాత్రూమ్‌లో ఉన్నాడా? సూపర్ ఓవర్‌లో అతడ్ని ఫస్ట్ ఛాయిస్‌గా ఎందుకు పంపలేదో అర్థం కావడం లేదు. అతడు మెయిన్ ఇన్నింగ్స్‌‌లో 18 బంతుల్లో 38 రన్స్ చేశాడు. మంచి హిట్టింగ్‌‌తో ఊపు మీద కనిపించాడు. హైదరాబాద్ బాగానే పోరాడినప్పటికీ ఓటమికి తాము తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని గ్రహించాలి’ అని వీరూ ట్వీట్ చేశాడు.