ఇబ్రహీంపట్నం, వెలుగు : ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లిగూడ గేట్ సమీపంలో హైదరాబాద్రూట్లో ఓ డీసీఎం వెళ్తోంది.
అయితే, దీని వెనకే వస్తున్న ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు డీసీఎంను ఢీకొట్టి ఆగిపోయింది. దీని వెనకే వస్తున్న రెండు బైక్ లు బస్సును ఢీకొట్టడంతో బస్సులోని ఇద్దరు, బైక్ పై ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సాగర్ రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఆదిభట్ల పోలీసులు గాయపడ్డ వారిని దవాఖానకు తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
