
సుమయ రెడ్డి హీరోయిన్గా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘డియర్ ఉమ’. సాయి రాజేష్ మహాదేవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ‘దియ’ ఫేమ్ పృథ్వీ అంబర్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ‘సందేశంతో కూడిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తున్నామని, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీస్తున్నామని దర్శకనిర్మాతలు చెప్పారు.
త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను రివీల్ చేస్తామన్నారు. కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ ఇతరపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రధన్ సంగీతం అందిస్తున్నాడు.