బ్రిటీష్‌‌‌‌ అవార్డుల్లో స్పెషన్ అట్రాక్షన్‌‌‌‌గా దీపికా.. ఇండియన్‌‌‌‌ క్వీన్‌‌‌‌ అంటూ ప్రశంసలు

బ్రిటీష్‌‌‌‌ అవార్డుల్లో స్పెషన్ అట్రాక్షన్‌‌‌‌గా దీపికా.. ఇండియన్‌‌‌‌ క్వీన్‌‌‌‌ అంటూ ప్రశంసలు

లండన్‌‌‌‌లోని రాయల్ ఫెస్టివల్‌‌‌‌ హాల్‌‌‌‌లో 77వ బాఫ్టా ఫిల్మ్ అవార్డ్స్‌‌‌‌ (బ్రిటిష్ అకాడమీ ఆఫ్‌‌‌‌ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డ్స్‌‌‌‌) వేడుక ఆదివారం జరిగింది.  ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డుల ప్రదానోత్సవంలో దీపికా పదుకొణె స్పెషల్‌‌‌‌ అట్రాక్షన్‌‌‌‌గా నిలిచింది. ప్రజెంటర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించిన  ఆమె, ‘బెస్ట్‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌ నాట్‌‌‌‌ ఇన్‌‌‌‌ ఇంగ్లీష్‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌’ కేటగిరీలో అవార్డు గెలుచుకున్న ‘ది జోన్ అఫ్ ఇంట్రెస్ట్’ చిత్రానికి అవార్డును ప్రదానం చేసింది. భారతీయత ఉట్టిపడేలా చీరకట్టుతో ఆమె ఆకట్టుకుంది.

ఇండియన్‌‌‌‌ క్వీన్‌‌‌‌’ అంటూ నెటిజన్స్‌‌‌‌ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏకైక భారతీయ నటి దీపిక కావడం విశేషం. ఇక ‘ఓపెన్‌‌‌‌ హైమర్‌‌‌‌‌‌‌‌’ చిత్రం ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులను గెలుచుకుని సత్తా చాటింది. బెస్ట్‌‌‌‌ మూవీతో పాటు నటుడిగా సిలియన్‌‌‌‌ మర్ఫీ, దర్శకుడిగా క్రిస్టఫర్‌‌‌‌ నోలన్‌‌‌‌, సహాయ నటుడిగా రాబర్ట్ డౌనీ జూనియర్, ఒరిజినల్ స్కోర్‌‌‌‌‌‌‌‌కు లుడ్విగ్ గోరాన్సన్, సినిమాటోగ్రఫీకి హాట్ వాన్ హోటిమా, ఉత్తమ ఎడిటింగ్‌‌‌‌కి జెన్నిఫర్ లేమ్ ‘ఓపెన్‌‌‌‌ హైమర్‌‌‌‌‌‌‌‌’ చిత్రానికి అవార్డులు అందుకున్నారు. దర్శకుడిగా క్రిస్టఫర్‌‌‌‌ నోలన్‌‌‌‌కు ఇదే ఫస్ట్‌‌‌‌ బాఫ్టా అవార్డు. ‘పూర్‌‌‌‌ థింగ్స్’ చిత్రానికి ఉత్తమ నటిగా ఎమ్మా స్టోన్‌‌‌‌ అవార్డును అందుకున్నారు. ఇదే చిత్రం మరో నాలుగు అవార్డులను గెలుచుకోగా, ‘ది జోన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇంట్రెస్ట్‌‌‌‌’ చిత్రాన్ని మూడు అవార్డులు వరించాయి.