Spirit వివాదంలో బిగ్ ట్విస్ట్: దీపికాకు సందీప్ రెడ్డి వంగా కథే చెప్పలేదట? వెలుగులోకి కొత్త విషయాలు

Spirit వివాదంలో బిగ్ ట్విస్ట్: దీపికాకు సందీప్ రెడ్డి వంగా కథే చెప్పలేదట? వెలుగులోకి కొత్త విషయాలు

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమా నుంచి ప్రముఖ నటి దీపికా పదుకొణె తప్పుకోవడం వెనుక అసలు కారణాలపై వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సినిమా లాభాల్లో 10 శాతం వాటా డిమాండ్ చేయడం వల్లే ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు దర్శకుడి సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా ఇటీవల కామెంట్స్ చేశాడు. ఇపుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఈ క్రమంలోనే వంగా సోదరులను తప్పుపడుతూ ఒక జర్నలిస్ట్ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది. ఇక ఆ పోస్ట్‌ను స్వయంగా దీపికా పదుకొణె లైక్ చేయడం టాలీవుడ్ & బాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

వివాదానికి కారణం ఇదే..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రణయ్ రెడ్డి వంగా.. ‘స్పిరిట్’ కోసం దీపికా భారీ రెమ్యునరేషన్ తో పాటు సినిమా లాభాల్లో 10 శాతం ప్రాఫిట్ షేర్ కోరినట్లు చెప్పారు. అలాగే వర్కింగ్ అవర్స్ వంటి అంశాలపై కూడా చర్చలు జరిగినప్పటికీ, బడ్జెట్ పరిమితుల కారణంగా మరో హీరోయిన్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

ఒక్క లైక్.. సోషల్ మీడియాలో దుమారం

ఈ క్రమంలోనే ప్రణయ్ కామెంట్స్ తర్వాత ఓ సినీ జర్నలిస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ Z-స్పీడ్ వేగంతో వైరల్ అయింది. “పురుష హీరోలు ప్రాఫిట్ షేర్ తీసుకుంటే అది బిజినెస్.. అదే ఒక మహిళ అడిగితే ఎందుకు వివాదం?” అంటూ ఆ పోస్టులో సదరు జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఇక ఈ పోస్టుకు దీపికా లైక్ చేయడంతో, ఆమె తన అభిప్రాయాన్ని పరోక్షంగా వెల్లడించారనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది.

గతేడాది ఏం జరిగింది?

గతేడాది దీపికా ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్నప్పుడు, తాను ప్రెగ్నెన్సీ గా మారిన ఆమె రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని కండిషన్ పెట్టిందనే వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ ఇంటర్వ్యూతో ప్రాఫిట్ షేర్ అంశమే ప్రధాన కారణమన్న వాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ రెండు వాదనల్లో ఏది నిజమనే దానిపై మాత్రం మేకర్స్ నుంచి స్పష్టమైన అధికారిక ప్రకటన లేదు.

అసలు సైనే చేయలేదు: దీపికా టీమ్ సంచలన వాదన

‘స్పిరిట్’ వివాదానికి మరో కోణాన్ని దీపికా పదుకొణె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. తమ వాదన ప్రకారం, దీపికా ఈ చిత్రానికి ఎప్పుడూ అధికారికంగా సంతకం చేయలేదని స్పష్టం చేస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగాతో జరిగిన తొలి భేటీలో దర్శకుడు పూర్తి కథను వివరించలేదని, కేవలం సినిమా యొక్క వన్-లైన్ ఐడియా మాత్రమే చెప్పారని పేర్కొంటున్నారు. పూర్తి నరేషన్ వినకుండా, పాత్రకు సంబంధించిన స్పష్టత లేకుండా దీపికా ఏ ప్రాజెక్ట్‌కూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వదని చెబుతున్నారు. అందువల్ల ‘స్పిరిట్’ నుంచి తప్పుకుంది అనే ప్రచారమే సరైంది కాదని, అసలు ఒప్పందం కుదరనప్పుడు వైదొలగడం అనే ప్రశ్నే తలెత్తదని ఆమె సన్నిహిత వర్గాలు వాదిస్తున్నాయి. మరి ఈ విషయంపైనా సందీప్ రెడ్డి వంగా నేరుగా క్లారిటీ ఇస్తేనే, అన్ని విషయాలకు సమాధానం దొరుకుతుంది. 

‘స్పిరిట్’లో తృప్తి డిమ్రి..

ప్రస్తుతం ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు దీపికా ‘కింగ్’, ‘రాకా’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.