అజయ్ దేవగన్ సింగం ఎగైన్‌

అజయ్ దేవగన్ సింగం ఎగైన్‌

అజయ్ దేవగన్‌‌‌‌తో సింగం, రణ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌తో సింబా, అక్షయ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌తో సూర్యవంశీ లాంటి పోలీస్‌‌‌‌ స్టోరీలను రూపొందించిన రోహిత్ శెట్టి.. ఈసారి తన కాప్ యూనివర్స్‌‌‌‌లోకి లేడీ సింగంలను తీసుకొస్తున్నాడు. అజయ్ దేవగన్​ హీరోగా రోహిత్ తెరకెక్కిస్తున్న ‘సింగం ఎగైన్‌‌‌‌’ చిత్రంలో దీపిక పదుకొణె.. శక్తి శెట్టి అనే పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోందని ఇప్పటికే తన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో ప్రకటించారు. తాజాగా కరీనా కపూర్‌‌‌‌‌‌‌‌ను పరిచయం చేశారు.

ఇందులో దెబ్బలతో కనిపిస్తున్న కరీనా..  గన్ పట్టుకుని సీరియస్ లుక్‌‌‌‌తో ఉన్న పోస్టర్ ఇంప్రెస్ చేస్తోంది. అవని సింగం పాత్రలో చాలా పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ రోల్ పోషించిందని రివీల్ చేశారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, రణవీర్‌‌‌‌‌‌‌‌ సింగ్ క్యారెక్టర్స్‌‌‌‌ను ఇంట్రడ్యూస్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. అలాగే  ‘సింగం’ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమా కావడంతో మరింత ఆసక్తి పెరిగింది.