దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ దసరా పండుగ రోజు తమ చిన్న కూతురి పేరు ఏంటో రివీల్ చేశారు. తమ చిన్న కూతురి పేరు దేవి పదుకొనే సింగ్ అని ఒక క్యూట్ ఫ్యామిలీ ఫొటోతో ఈ జంట అనౌన్స్ చేసింది. పెద్ద కూతురు దువా పదుకొనే సింగ్ తన చిట్టి చెల్లిని ముద్దాడుతున్న మధుర క్షణాలను చూసి సంతోషంలో మునిగి తేలుతున్న రణ్ వీర్, దీపికా జంటను చూస్తుంటే నిజానికి రెండు కళ్లు చాలడం లేదు. ఒక అరుదైన ఫొటోగా ఈ దృశ్యం నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సెప్టెంబర్ 19న ఎంతో పవిత్రమైన రాధాష్టమి రోజున దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ చిన్న కూతురికి తమ ప్రపంచంలోకి స్వాగతం పలికారు. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలో.. ప్రేమకు ప్రతీక తమ దేవి పదుకొనే సింగ్ అని క్యాప్షన్ రాశారు. ఫ్యామిలీ మొత్తం గోల్డెన్ కలర్ డ్రెసెస్స్ ధరించి ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. ఇక.. ఈ ఇద్దరి సినిమా కెరీర్ విషయానికొస్తే.. రణ్ వీర్ సింగ్ అక్టోబర్ 27న ముంబైలోని ‘ప్రళయ్’ సెట్స్‌కు వెళతాడు. ఈ షెడ్యూల్ రెండు వారాల పాటు ఉండనుంది. ఇక.. దీపికా పదుకొనే రాకా, కింగ్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
