డా.టెడ్రోస్ తో దీపిక లైవ్ సెషన్ నిలిపివేత

డా.టెడ్రోస్ తో దీపిక లైవ్ సెషన్ నిలిపివేత

న్యూఢిల్లీ: వరల్డ్ హెల్త్​ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయసస్ తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పాల్గొనాల్సిన ఇన్ స్టాగ్రామ్ లైవ్ సెషన్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం టెడ్రోస్ తో ఇన్ స్టా లైవ్ సెషన్ లో దీపిక పాల్గొనాల్సి ఉంది. ఆ సెషన్ లో భాగంగా ‘మెంటల్ హెల్త్ డ్యూరింగ్ పాండెమిక్ అండ్ బియాండ్’ అనే టాపిక్ పై దీపిక మాట్లాడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న ఊహించని, అనివార్య పరిస్థితుల మధ్య లైవ్ సెషన్ ను హోల్డ్ లో ఉంచుతున్నట్లు దీపిక ఓ ప్రకటనలో తెలిపింది. తదుపరి నోటీస్ వచ్చేంత వరకు ఈ సెషన్ ను నిలిపివేశామని పేర్కొంది.