దీవాన కొత్త పాయింట్‌‌‌‌తో సర్ప్రైజ్ చేస్తుంది

దీవాన కొత్త పాయింట్‌‌‌‌తో సర్ప్రైజ్ చేస్తుంది

‘శుభం’ సినిమాతో ఆకట్టుకున్న హర్షిత్ రెడ్డి.. ఇప్పుడు ‘దీవాన’ చిత్రంతో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. స్మేహ మణిమేగలై హీరోయిన్.  శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడు.  వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ నెల 19న  గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదలవుతోంది.  

ఈ సందర్భంగా హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా స్వస్థలం మిర్యాలగూడ. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. నా యూట్యూబ్‌‌‌‌  వీడియోస్‌‌‌‌ చూసి వైజయంతీ సంస్థ ‘మెయిల్’ సినిమాకు సెలెక్ట్ చేశారు. అందులో నా డైలాగ్ డెలివరీ నచ్చి రాజ్ అండ్ డీకే ‘శుభం’ సినిమాకు ఎంపిక చేశారు.  

అలాగే నాగ్ అశ్విన్‌‌‌‌ గారు ‘కల్కి’ సినిమాలో ఆడిషన్ లేకుండానే తీసుకున్నారు. రెండు వెబ్ సిరీస్‌‌‌‌ల్లో కూడా నటించా. ఇక ‘శుభం’ సినిమాకు ముందే ‘దీవాన’లో అవకాశం వచ్చింది.  ఇందులో నేను పోషించిన మున్నా పాత్రలో.. ‘రంగీలా’లో ఆమిర్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌లా కనిపించాలని మా డైరెక్టర్ చెప్పారు. ఆ  పాత్రలో ఓల్డ్ సిటీ కుర్రాడు అనే వైబ్ ఉంటుంది. నేను మలక్ పేట, కొత్తపేటలో పెరగడం, మా డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ సికింద్రాబాద్‌‌‌‌ వాసి కావడం కలిసొచ్చింది.

ప్రేమలో పూర్తిగా మునిగిన ఓ కుర్రాడి కథ ఇది. మనం చాలా లవ్ స్టోరీస్‌‌‌‌ చూసుంటాం కానీ ఇందులో ఒక కొత్త పాయింట్, ఎమోషన్ ఉంది. ఇంటర్వెల్‌‌‌‌లో అది షాక్ కు గురిచేస్తుంది. కొద్ది నిమిషాలు అలా చూస్తుండిపోతారు. ప్రస్తుతం ‘కల్కి 2’తో పాటు ‘రోమియో జూలియట్’ అనే సినిమా చేస్తున్నా’’ అని చెప్పాడు.