మధురమైన గాత్రంతో అలరిస్తోన్న కానిస్టేబుల్

మధురమైన గాత్రంతో అలరిస్తోన్న కానిస్టేబుల్

ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న రజత్ రాథోర్ అనే వ్యక్తి.. తన సంగీత ప్రతిభతో అందర్నీ ఆహ్లాదపర్చాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. తన తోటి స్నేహితులతో కలిసి పాటలు పాడుతూ.. ఆ వీడియోలను రజత్... సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అదే తరహాలో రీసెంట్ గా షేర్ చేసిన ఈ వీడియోలో.. బాలీవుడ్ హిట్ పాట తేరా హోనే లగా హూన్ అనే సాంగ్ కు రజత్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు.ఈ ఫర్మార్మెన్స్ లో రజత్ పాటు మరికొందరు పోలీసులు కూడా భాగస్వామ్యులయ్యారు. ఇందులో రాథోర్ యూనిఫాం ధరించి, గిటార్‌ వాయిస్తూ పాడుతున్నారు. ఈ పాట అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ చిత్రంలోనిది. ఈ సినిమాలో కత్రినా కైఫ్, రణబీర్ కపూర్‌ నటించారు.

ఈ వీడియోను ఏప్రిల్ 17న పోస్ట్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోకు దాదాపు 4.5 మిలియన్ల వ్యూస్, 4లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. రాథోర్ తన సంగీత ప్రతిభతో సోషల్ మీడియా యూజర్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రాథోర్ పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. అతని మధురమైన స్వరానికి ముగ్ధులవుతున్నారు.