విచారణ సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు రూ.10వేల పీస్ బాండ్ సమర్పించాలంటూ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్‌తో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, విచారణ ప్రక్రియకు సంబంధించిన అన్ని ఆధారాలు,సమాచారాన్ని నేహా బోరాకు అందించాలని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) ను హైకోర్టు ఆదేశించింది.
అక్టోబర్ 16న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు రాజీనామాను డిమాండ్ చేస్తూ లెహ్రా దో తిరంగా మార్చ్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా నేహా బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత శాంతిభద్రతలను కాపాడటానికి ఒకరి పూచీకత్తుతో పాటు రూ. 10వేల బాండ్ సమర్పించాలని SEM నోటీసులు జారీ చేసింది.
జాతీయ జెండా ఎగురవేసేందుకు పౌరులకు ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని నేహా బోరా వాదిస్తున్నారు. పోలీసులు నోటీసు అస్పష్టంగా ఉందని, తన ఫండమెంటల్ రైట్స్ ను ఉల్లంఘించేలా ఉందని ఆమె తరపు లాయర్ కోర్టులో వాదించారు.
నేహా బోరా పదేపదే నిరసన కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని, నిషేధిత ప్రాంతాల వైపు వెళ్లాల్సిందిగా ప్రదర్శనకారులను ప్రోత్సహించారని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో ప్రస్తుత దశలో ఆమె పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.
Delhi High Court dismisses Neha Bora’s plea challenging the SEM Court notice asking her to execute a ₹10,000 bond with a surety to maintain peace during the inquiry. The court has, however, issued certain directions to the magistrate, including furnishing all relevant material to Bora.
— ANI (@ANI) October 23, 2026
