విజయ రాజ్ కుమార్ హీరోగా ప్రీతం కస్తూరి దర్శకత్వంలో సంకీర్త్ కొండ నిర్మించిన చిత్రం ‘డెలులు’. అఖిల్ జాక్సన్, శ్రీరామ మండవ కీలక పాత్రలు పోషించారు. తాజాగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన రాగ్ మయూర్ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.
ఈ సందర్భంగా విజయ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ‘ఇప్పటివరకు ఎవరూ సాహసించని కథను ‘డెలులు’ ద్వారా చెప్పబోతున్నాం. ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారు’ అని చెప్పాడు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరోయిన్స్ వేణి రావు, సాయి ప్రసన్న థ్యాంక్స్ చెప్పారు. డైరెక్టర్ ప్రీతం మాట్లాడుతూ ‘టీమ్ అందరి సపోర్ట్‌తో మంచి అవుట్‌పుట్ వచ్చింది. ఇందులోని డైలాగ్స్, మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’ అని చెప్పాడు.
