కాంప్లెక్స్ పనులకు టెండర్లు పిలవాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

కాంప్లెక్స్ పనులకు టెండర్లు పిలవాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

వైరా/ తల్లాడ, వెలుగు: వైరా నియోజకవర్గ కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు అవసరమైన టెండర్ల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆఫీసర్లకు సూచించారు. శుక్రవారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా వైరా పట్టణంలో కొద్దిసేపు ఆగి, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌‌‌‌, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, సూడా చైర్మన్ పువ్వల దుర్గాప్రసాద్ తో చర్చించి పలు సూచనలు చేశారు. 

అనంతరం రోడ్డు పక్కన మొబైల్ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తితో మాట్లాడి, మొబైల్ వ్యాన్ తయారీకి ఎంత ఖర్చయిందో అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో సీతారామ ప్రాజెక్టు మ్యాప్‌‌‌‌ను పరిశీలించారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఆయనతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు డిప్యూటీ సీఎం  భట్టి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం ఏన్కూర్​ రాజీవ్​ లిఫ్ట్​ కెనాల్ కాలువ నుంచి తల్లాడ మీదుగా చేపట్టిన కాలువల నిర్మాణ పనుల పురోగతిని సిరిపురం వద్ద పరిశీలించారు.