‘సర్దార్’ కంటే ‘సర్దార్ 2’ కాన్సెప్ట్ పదిరెట్లు ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని, లార్జర్ స్కేల్‌లో చేసిన ఈ సినిమా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని కార్తి అన్నాడు. పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. సెప్టెంబర్ 10న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తి చెప్పిన విశేషాలు.
‘‘స్పై సినిమాలు ఎక్కువగా దేశం బయట జరిగే ఆపరేషన్ల చుట్టూ ఉంటాయి. కానీ ‘సర్దార్ 2’లో ఇండియాలో జరుగుతున్న సమస్యను ఒక గూఢచారి ఎలా హ్యాండిల్ చేశాడనేది చూపించాం. బిగినింగ్ నుంచి క్లైమాక్స్ వరకు యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి. అలాగే ఇందులో ఫాదర్, సన్ పాత్రలు కలిసి ట్రావెల్ చేస్తాయి. రెండు పాత్రలను ఒకేసారి చేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది.
ముఖ్యంగా ఓల్డ్ మ్యాన్‌గా ఫైట్స్ చేయడం కొత్త అనుభూతిని ఇచ్చింది. హీరోయిన్స్ ఆషిక రంగనాథన్, మాళవిక మోహనన్ పాత్రలు ఇంటెలిజెంట్‌గా, స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఎస్‌జే సూర్య క్యారెక్టర్ కూడా ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తుంది. అలాగే వందే భారత్ ట్రైన్ మొత్తాన్ని సెట్‌గా వేశాం. సౌత్‌లో స్పై సినిమాకు కొత్త బెంచ్‌మార్క్‌లా ‘సర్దార్ 2’ ఉంటుంది. యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 4’, కళ్యాణ్ శంకర్‌తో ఓ ఎంటర్‌టైనర్, ‘మార్షల్’ సినిమాలు చేస్తున్నా’’.
