రేజ్ ఆఫ్ తీక్షణ సాంగ్‌‌‌‌ రిలీజ్

రేజ్ ఆఫ్ తీక్షణ సాంగ్‌‌‌‌ రిలీజ్

కన్నడ స్టార్ ఉపేంద్ర భార్య ప్రియాంక లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటించిన చిత్రం ‘డిటెక్టివ్ తీక్షణ’. ఆమె నటిస్తున్న 50వ సినిమా ఇది. త్రివిక్రమ్ రఘు దర్శక త్వంలో గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్ నిర్మించారు. ఇప్పటికే ట్రైలర్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్న టీమ్.. శనివారం ఫస్ట్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు.

‘రేజ్ ఆఫ్ తీక్షణ’ అంటూ విడుదలైన పాటలో ప్రియాంక ఇంటెన్స్ లుక్‌‌‌‌లో కనిపిస్తున్నారు. ‘రణరణమున రధము నిలిపి, రుధిర నదిని ఎదురు మలిపి.. కుత్తుకల కోట కూల్చే తీక్షణా..’ అంటూ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ లిరిక్స్‌‌‌‌ రాసి, పాటను కంపోజ్ చేశాడు పెద్దపల్లి రోహిత్. హైమత్ మొహమ్మద్, సాయి చరణ్ భాస్కరుని, అరుణ్ కౌండిన్య కలిసి పాడారు.