ఎన్టీఆర్‌‌, సైఫ్‌‌ అలీఖాన్‌‌ కాంబినేషన్‌‌.. దేవర న్యూ షెడ్యూల్

 ఎన్టీఆర్‌‌, సైఫ్‌‌ అలీఖాన్‌‌ కాంబినేషన్‌‌.. దేవర న్యూ షెడ్యూల్

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. జనవరి ఫస్ట్ వీక్ నుంచి నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌‌లో ఎన్టీఆర్‌‌, -సైఫ్‌‌ అలీఖాన్‌‌ కాంబినేషన్‌‌లో రెండు భారీ యాక్షన్‌‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

పీటర్ హెయిన్ కంపోజ్ చేస్తున్న  యాక్షన్ ఎపిసోడ్స్ చాలా కొత్తగా, సర్ ప్రైజింగ్‌‌గా ఉండటంతో పాటు సినిమాకు హైలైట్‌‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ప్రతి ఫైట్  సినిమాకు క్లైమాక్స్‌‌లా అనిపిస్తుందని చెప్పడంతో మరింత ఆసక్తిని పెంచుతోంది.  సముద్రం బ్యాక్‌‌డ్రాప్‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డిఫరెంట్‌‌ లుక్‌లో కనిపిస్తాడని, ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌ ద్వారా రివీల్ చేశారు.  

జాన్వీకపూర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది.  కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.  ఏప్రిల్‌‌ 5న ఫస్ట్ పార్ట్ సినిమా విడుదల కానుంది.  రీసెంట్‌‌గా ‘డెవిల్’ ప్రమోషన్స్‌‌లో కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ ‘దేవర’ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నామని, త్వరలోనే గ్లింప్స్ రాబోతుందని చెప్పడంతో ఎక్స్‌‌పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి.