గోవాలో దేవర టీం..నెక్ట్స్ షెడ్యూల్‌‌ కోసమేనా

గోవాలో దేవర టీం..నెక్ట్స్ షెడ్యూల్‌‌ కోసమేనా

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘దేవర’.  హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ కొత్త షెడ్యూల్ గోవాలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌‌ పది రోజుల పాటు జరగనుందని తెలుస్తోంది. ఎన్టీఆర్‌‌‌‌తో పాటు ఇతర నటీనటులతో బీచ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారట.

ఇందులో ఎన్టీఆర్ డ్యూయెల్‌‌ రోల్‌‌లో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది.  ఇక హీరోయిన్‌‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ ఈ చిత్రంతో  టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్‌‌గా కనిపించనున్నాడు.  ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్‌‌గా విడుదలైన టీజర్ సినిమాపై బజ్‌‌ను పెంచింది.  కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.  రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌‌ దసరా కానుకగా  అక్టోబర్ 10న వరల్డ్‌‌ వైడ్‌‌గా విడుదల కానుంది. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్,కొరటాల కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి.