ప్రభాస్ కాదు కళ్యాణ్ రామ్.. అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చిన డెవిల్

ప్రభాస్ కాదు కళ్యాణ్ రామ్.. అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చిన డెవిల్

2023 ఇయర్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ ఇయర్ టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాస్తే.. మరికొన్ని డిజాస్టర్స్ గా నిలిచాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు బోల్తా కొత్తగా.. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు సంచలనాలు సృష్టించాయి. అలా ఈ ఇయర్ సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి,బలగం,బేబీ, సలార్,విరూపాక్ష,సామజవరగమన,దసరా వంటి చాలా సినిమాలే ఉన్నాయి. 

అయితే ఈ ఇయర్ ఎండింగ్ ఫైనల్ టచ్ సలార్ అనుకున్నారు అంతా. కారణం ఈ సినిమా ఇయర్ ఎండింగ్ లో వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. కొత్త కాలంగా సరైన హిట్ లేక సతమవుతున్న ప్రభాస్ కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే రూ.500 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ మూవీ. దీంతో ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. ఇప్పటికి భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది సలార్ మూవీ. 

అయితే ఈ ఇయర్ ఫినిషింగ్ టచ్ సలార్ డే అనుకున్నారంతా కానీ,, సైలెంట్ గా వచ్చిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన డెవిల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో సలార్ హిట్ తో ప్రభాస్ ఈ ఇయర్ కు ఎండ్ కార్డు వేస్తాడనుకుంటే.. అసలు అంచనాలు లేకుండా వచ్చిన డెవిల్ మూవీ సూపర్ హిట్ తో 2023కు స్వస్తీ పలుకానున్నాడు కళ్యాణ్ రామ్.

ఇక డెవిల్ సినిమా విషయానికి వస్తే.. పీరియాడిక్ డ్రామాగా వచ్చిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటీవ్ త్రిల్లర్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. నవీన్ మేడారం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ట్విస్టులకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా సూపర్ గా ఉందంటూ.. 2023కు కళ్యాణ్ రామ్ అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సంక్రాంతి వరకు సమయం ఉంది కాబట్టి కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టే అవకాశం ఉంది డెవిల్ మూవీకి.