ఆధ్యాత్మికం: జూన్13 అరుదైన రోజు.. శనిత్రయోదశి+మాసశివరాత్రి.. శని భగవానుడి పూజా విధానం ఇదే..!

ఆధ్యాత్మికం:  జూన్13 అరుదైన రోజు.. శనిత్రయోదశి+మాసశివరాత్రి.. శని భగవానుడి పూజా విధానం ఇదే..!

హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుల్లో ఒకటి శని త్రయోదశి.... అంటే శనివారం రోజున త్రయోదశి తిధి వస్తే.. ఆ రోజుని శని త్రయోదశి అని అంటారు. శనివారం శనీశ్వరుడికి, విష్ణువు, ఇష్టమైన రోజు అయితే.. త్రయోదశి తిధి శివుడికి ఇష్టమైన తిథి బహుళ చతుర్దశి .. 2026.జూన్​ 13 శనివారం ఉదయం ఘడియల్లో త్రయోదశి .. సాయంత్రం చతుర్థశి తిథి ఉండంతో ఆరోజుకు చాలా ప్రాధాన్యత ఉందని పండితులు అంటున్నారు. 

జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని లేదా ఇతర శని సంబంధిత ప్రభావాలు ఉన్నప్పుడు జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగంలో ఆటంకాలు, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని విశ్వసిస్తారు. అలాంటి పరిస్థితుల్లో శని త్రయోదశి రోజున శని భగవానుడిని, పరమశివుడిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ 13న శని త్రయోదశి, మాసశివరాత్రి యోగం కలిసి రావడం విశేషంగా భావిస్తున్నారు. ప్రదోష కాలంతో కూడిన ఈ రోజు శివారాధన, శని శాంతి పరిహారాలకు అత్యంత అనుకూలమైన సందర్భంగా పేర్కొంటున్నారు.

శని త్రయోదశి తేదీ మరియు సమయం

  • శని త్రయోదశి 2026 తేదీ: జూన్​ 13  శనివారం
  •  త్రయోదశి తిథి ప్రారంభం: జూన్​ 12 శుక్రవారం సాయంత్రం  4.18 గంటలకు 
  •  త్రయోదశి తిథి ముగింపు:జూన్​ 13 శనివారం మధ్యాహ్నం  2.03 గంటలు

శని త్రయోదశి శివుడు, పార్వతి దేవి ...  శని భగవంతుని ఆరాధనకు అంకితం చేయబడింది. ఆ  రోజున శని భగవానుడిని ఆరాధిస్తే...   శని  ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందుతారు. శనిదోష ప్రభావం తగ్గుతుందని పురాణాలు చెబుతున్నాయి.  

శని త్రయోదశి పూజా విధానం:

శని త్రయోదశి రోజున బ్రహ్మ ముహూర్త సమయానికి నిద్ర లేచి కాలకృత్యాల అనంతరం..  శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపారాధాన చేసి.. శని భగవానుడిని ఆరాధించి పూజించాలి.  శని భగవానుడితో పాటు శివ పార్వతులను కూడా అర్చన చేయాలి. ఉపవాస దీక్షను పాటించాలి. 

ఈ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపం చేయాలి. 

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం

శని త్రయోదశి రోజున శివాలయంలో నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి.. శని భగవానుడికి తైలాభిషేకం చేయాలి.  తరువాత తమలపాకులో నువ్వులు.. బెల్లంతో తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి.  ఆ తరువాత నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయాలి.  ఆ తరువాత స్నానం చేసి.. మరల శివాలయంలో శివుడికి గాని.. ఆంజనేయ స్వామికి గాని 11 ప్రదక్షిణలు చేయాలి.  శని వాహనం కాకి.. కావున కాకికి ఆహారాన్ని పెడితే చాలా మంచిదని పూజారులు చెబుతున్నారు. నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో పంచదారను చల్లండి.  

ఆ తరువాత రావి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే ఎంతో  ప్రయోజనం ఉంటుంది.  శని భగవానుడి భార్య జ్యేష్టాదేవి.. రావి చెట్టు మొదట్లో నివసిస్తుంది.  శని త్రయోదశి రోజున రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు.. శని దోషం తొలగిపోతుంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.