ఆధ్యాత్మికం:ఇంట్లోఈ మొక్కలున్నాయా..లక్ష్మీదేవి తిష్టవేస్తుంది..చేతినిండా డబ్బు..ఇంటినిండా ఐశ్వర్యమే

ఆధ్యాత్మికం:ఇంట్లోఈ మొక్కలున్నాయా..లక్ష్మీదేవి తిష్టవేస్తుంది..చేతినిండా డబ్బు..ఇంటినిండా ఐశ్వర్యమే

ప్రస్తుతం ఏ చిన్న సమస్య వచ్చినా చాలామంది.. వాస్తు.. జ్యోతష్యం.. ఆధ్యాత్మిక పండితులను సంప్రదిస్తున్నారు. మానవ జీవితానికి డబ్బు చాలా అవసరం..లక్ష్మీదేవి అనుగ్రహం కోసం  చాలా కష్టపడుతుంటారు.  కొంతమందికి ఎంత సంపాదించిన చేతిలో చిల్లిగవ్వ ఉండదు.  అంటే శాస్త్రాల ప్రకారం... లక్ష్మీదేవి అనుగ్రహం విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయని చెబుతుంటారు.  అలాంటి వారు  పురాణాల ప్రకారం...  హిందూ మత విశ్వాసాల ఆధారంగా ,  లక్ష్మీదేవి స్వరూపంగా భావించే కొన్ని మొక్కలను  పెంచాలని పండితులు చెబుతున్నారు.  అవి శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టమైనవని చెబుతున్నారు.  ఇవి ఇంటిలో  ఉండాల్సిన ప్రదేశంలో ఉంటే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.  ఇప్పుడు ఆ మొక్కలు ఏవి.. ఏ మొక్కను ఏ దిశలో పెంచాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

శమీ మొక్క.  ఈ మొక్క పరమేశ్వరుడికి చాలా ఇష్టం. ఒక్క శివుడికే కాదు.. కర్మదాత శనీశ్వరుడికికి ప్రీతికరం.  ఈ మొక్కను ఇంటి ప్రధానం ద్వారం దగ్గర నాటాలి.  బయటకు వెళ్లేటప్పుడు కుడి పక్కన ఉండే విధంగా శమీ మొక్క ఉంటే .. బయటకు వెళ్లిన పనిలో ఎలాంటి ఆటంకాలు ఉండవని పండితులు చెబుతున్నారు.  అందుకే పెద్దలు బయటకు వెళ్లేటప్పుడు క్షేమంగా వెళ్లి లాభంగా రా.. అని చెబుతుంటారు. 

మనీ ప్లాంట్ :  వాస్తు ప్రకారం.. ఈ మొక్క ఎంత పైకి పెరిగితే  అంత సంపద ఉంటుందని పండితులు చెబతున్నాయి,  మనీ ప్లాంట్​ మొక్క ఇంటికి అందాన్నే కాదు.. ఆర్థిక లాభాలను కూడా కలుగజేస్తుంది.  వాస్తు ప్రకారం  ఈ మొక్కను  ఆగ్నేయ మూలలో ఉంచడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. 

అపరాజిత:   ఇది తీగ రూపంలో ఉంటుంది.  ఈ తీగ విష్ణుమూర్తికి చాలా ఇష్టం.  నీలిరంగులో ఉండే ఈ పూల తీగ ఉండే ఇంటిని లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఏర్పాటు చేసుకుంటుంది.  అపరాజిత పూలతో అమ్మవారిని పూజిస్తే ఆర్ధిక ఇబ్బందులు తీరతాయని పండితులు చెబుతున్నారు. ఈ మొక్క లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. దీనిని ఇంటికి ఉత్తర దిశలో కాని తూర్పు దిశలో కాని నాటాలని పండితులు చెబుతున్నారు. 

తులసి మొక్క.  దీని గురించి వే రే చెప్పనక్కరలేదు.  దాదాపు హిందువులందరూ ఈ మొక్కను చాలా పవిత్రంగా పూజిస్తారు. పురాణాల ప్రకారం ప్రతి రోజు తులసి మొక్కకు పసుపు. కుంకుమ, గంధంతో అలంకారం చేసి.. దీని దగ్గర దీపారాధన చేస్తే ఇంట్లో ప్రతికూల శక్తి నశిస్తుందని పండితులు చెబుతున్నారు. తులసి మొక్కను ప్రతి రోజు పూజించడం వలన ఐశ్వర్యం.. సంపద వృద్ది చెందుతుంది.  ఈ మొక్కను ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య మూలలో దిశలో నాటాలి.

జేడ్ మొక్క  : ఈ మొక్క ఇంట్లో టేబుల్​ పైకాని.. ఆఫీస్​ డెస్క్​ పై గాని  ఉంచాలి.  ఇది సంపదను ఆకర్షిస్తుంది.  ఈ మొక్క ఉందంటే చాలు దరిదాపుల్లోకి కూడా నెగిటివ్​ ఎనర్జీ రాదు.  ఇది డెస్క్‌కు ఉత్తరం వైపున ఉంచాలి.

వెదురు మొక్క :  వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అదృష్ట మొక్క.. ఇది ఎంత ఎత్తులో ఉంటే  అదృష్టం కూడా అంత బాగా ఉంటుందదని పండితులు చెబుతున్నారు.  ఈ మొక్కను ఇంట్లో పెంచడం సంతోషం .. శ్రేయస్సు కలుగుతుంది.  తోటల చుట్టే పెంచితే.. ఆతోట నుంచి వచ్చే ఆదాయం వృద్ది చెందుతుందని పండితులు చెబుతున్నారు.  ఇంట్లో ఈమొక్కను తూర్పు లేదా ఈశాన్య మూలలో ఉంచాలి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.