ఆషాఢమాసం కొనసాగుతుంది.వారాహి నవరాత్రి ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ మాసానికి ఆధ్యాత్మికంగా చాలా ప్రాధాన్యత ఉంది. వారాహినవరాత్రి ఉత్సవాలు ముగిసిన ఒక రోజు తరువాత అంటే ఆషాఢమాసంలో 11 వరోజుకు చాలా విశిష్టత ఉంది. ఆ పవిత్రమైన రోజు ఈ ఏడాది ( 2026) ఎప్పుడు వచ్చింది..ఆరోజు ఎలాంటి నియమాలు పాటించాలి. ఏమి చేయాలి.. ఏం చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !
హిందువులకు చాలా పవిత్రమైన రోజు..తొలి ఏకాదశి.. పంచాంగం ప్రకారం ఆషాఢమాసంలో 11 వరోజున జరుపుకుంటాం. పురాణాల ప్రకారం ఆరోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడని సండితులు చెబుతున్నారు. ఈ 4 నెలలను చాతుర్మాసం అంటారు. చాతుర్మాసంలో ఎటువంటి శుభ కార్యాలని నిర్వహించరు. ఈ 4 నెలలలో ఎక్కువ సమయం భగవంతుని పూజిస్తారు.
దేవశయని ఏకాదశి (తొలి ఏకాదశి) 2026 ఎప్పుడంటే..
- దేవశయని ఏకాదశి తిథి ప్రారంభం : జులై 24 శుక్రవారం ఉదయం 10:08 గంటలకు
- దేవశయని ఏకాదశి తిథి ముగింపు : జులై 25 శనివారం ఉదయం 11:54 గంటలకు
ఉదయం తిథి ప్రకారం జులై 25వ తేదీన శనివారం నాడు తొలి ఏకాదశిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు శ్రీ విష్ణుమూర్తికి అంకితమివ్వబడింది. ఈ పర్వదినాన ఉపవాస దీక్షను కూడా చేస్తారు. ఈ సమయంలో శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, నియమ నిష్ఠలతో విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీ హరి అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి.
- బ్రహ్మ ముహుర్తం: ఉదయం 4:16 గంటల నుంచి ఉదయం 4:57 గంటల వరకు
- అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:00 గంటలనుంచి మధ్యాహ్నం 12:55 గంటల వరకు
- పూజా ముహుర్తం : ఉదయం 7:21 గంటల నుంచి ఉదయం 9:03 గంటల వరకు
- సంధ్యా కాల సమయం: రాత్రి 7:17 గంటల నుంచి రాత్రి 8:19 గంటల వరకు
- ఉపవాస విరమణ :జూలై 26న తెల్లవారుజామున 5:38 గంటల నుంచి ఉదయం 8:22 గంటల వరకు
2026 జులై 25న రోజున ఏమి చేయాలంటే...
- తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి.
- శ్రీ మహా విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి.
- ఏకాదశి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం పాటించాలి.
- ధనం, ధాన్యాలు, వస్త్రాలు దానం చేయాలి.
- శ్రీ హరికి నైవేద్యంలో.. పూజలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి.
తొలి(దేవశయని ) ఏకాదశి నాడు ఏమి చేయకూడదంటే....
- దేవశయని ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు
- ఆ రోజు పొరపాటున కూడా అన్నం తినకూడదు.
- ఏకాదశి రోజున స్త్రీలను, పెద్దలను అవమానించకండి.
- ఏకాదశి రోజున బ్రహ్మచర్యం పాటించండి
- ఏకాదశి నాడు తులసి ఆకులను మొక్క నుంచి తెంపవద్దు
- ఉపవాసం ఉన్న వ్యక్తి.. ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు.
దేవశయని ఏకాదశి నియమాలు
- దేవశయని ఏకాదశి రోజున అన్నంతో చేసిన ఆహారం తినకూడదు.
- ఈ ఏకాదశి రోజున స్త్రీలు తల స్నానం చేయకూడదు.
- దేవశయని ఏకాదశి రోజున గోళ్లు, వెంట్రుకలు కత్తిరించకూడదు.
- దేవశయని ఏకాదశి నాడు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు మాత్రమే ధరించండి.
- మద్య. మాంసాలకు దూరంగా ఉండాలి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
