డ్రోగో ఏరోస్పేస్ డ్రోన్‌కు డీజీసీఏ సర్టిఫికేషన్ .. నిరంతరాయంగా 3 గంటల పాటు ప్రయాణం

డ్రోగో ఏరోస్పేస్ డ్రోన్‌కు డీజీసీఏ సర్టిఫికేషన్ .. నిరంతరాయంగా 3 గంటల పాటు ప్రయాణం

హైదరాబాద్​, వెలుగు:హైదరాబాద్ కు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ డ్రోగో ఏరోస్పేస్ తయారు చేసిన జేకే 250ఈ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (వీటీఓఎల్) డ్రోన్ కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి టైప్ సర్టిఫికేషన్ లభించింది.  సాయుధ దళాల నిఘా, సమాచార సేకరణకు దీనిని తయారు చేశారు. 

సాధారణ రన్ వేతో పనిలేకుండా నిలువుగా గాల్లోకి ఎగరడం, దిగడం దీని ప్రత్యేకత. ఇది 3 గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణించగలదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది. డ్రోగో ఇప్పటికే ఈ డ్రోన్లను ఇండియన్ ఆర్మీకి సరఫరా చేసింది.