
‘హిట్ ’ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్న నాని.. ప్రస్తుతం ‘ది పారడైజ్’ చిత్రంతో బిజీ అయ్యాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ జూన్ 21న ప్రారంభమైంది. వారం రోజులపాటు జరిగిన చిత్రీకరణలో హీరో చిన్నప్పటి సన్నివేశాలను తెరకెక్కించారు. శనివారం నాని ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అ య్యాడు. ‘ధగడ్ ఆగయా..’ అంటూ ఓ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని రివీల్ చేశారు మేకర్స్.
ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో 40 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో లీడ్ యాక్టర్స్పై పవర్ఫుల్ సీన్స్ చిత్రీకరించనున్నారు. ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషలలో వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది.