ధనరాజ్, హ్యాపీడేస్ ఫేమ్ వంశీ చాగంటి లీడ్ రోల్స్లో స్కంద దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. సాకీ రాయ్ హీరోయిన్. స్కంద దర్శకత్వం వహిస్తుండగా సత్యనారాయణ నాగుల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నామని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమా ఉంటుందని, త్వరలోనే చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని మేకర్స్ తెలియజేశారు. అప్పాజీ, దయానంద్ రెడ్డి, ప్రశాంత్, పద్మారావ్, కేశవి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.
