బుజ్జి ఇలా రా సెకెండ్ పార్ట్ స్టార్ట్

బుజ్జి ఇలా రా సెకెండ్ పార్ట్ స్టార్ట్

ధనరాజ్ హీరోగా మూడేళ్ల క్రితం వచ్చిన ‘బుజ్జి ఇలా రా’ చిత్రానికి సెకెండ్ పార్ట్ రూపొందిస్తున్నారు. ‘గరుడవేగ’ అంజి దర్శకత్వంలో కాసిమ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అతిథులుగా హాజరైన దర్శకుడు సాయి రాజేష్ క్లాప్ కొట్టగా, నిర్మాత సి.కళ్యాణ్ కెమెరా స్విచాన్ చేశారు. మరో దర్శకుడు విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు.

కోన వెంకట్, దామోదర ప్రసాద్ దర్శక నిర్మాతలకు స్ర్కిప్ట్ అందజేశారు.  ఈ సినిమా లోగోని  ఓంకార్,  కెమెరామెన్ సెంథిల్ కుమార్ లాంచ్ చేశారు.  ‘బుజ్జి ఇలా రా2’  నో లిమిట్స్ ట్యాగ్ లైన్‌‌‌‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో  తండ్రి కూతుర్ల ఎమోషన్ ప్రేక్షకులకు  మంచి అనుభూతినిస్తుందని మేకర్స్ చెప్పారు.