
ధనరాజ్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రామం రాఘవం’. సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నారు. పృథ్వి పోలవరపు నిర్మాత. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్‌ను హీరో రామ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి బెస్ట్ విషెస్ చెప్పాడు. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసి, తండ్రీ కొడుకుల ఎమోషనల్ జర్నీగా రాబోతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని శుభాకాంక్షలు చెప్పారు. ‘విమానం’ దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను అందిస్తున్న ఈ చిత్రంలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృథ్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల కానుంది.