Ayalaan Movie: సంక్రాంతి రేసు నుంచి మరో సినిమా ఔట్!

Ayalaan Movie: సంక్రాంతి రేసు నుంచి మరో సినిమా ఔట్!

శుక్రవారం వస్తేనే సినిమాల పండుగ వస్తోంది. అలాంటిది సంక్రాంతి లాంటి పండుగ వస్తే..ఇక సినిమాల జాతర ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు అదే ఊహలో ఉన్నారు టాలీవుడ్ సినిమా లవర్స్. పెద్ద హీరోలు..భారీ బడ్జెట్ సినిమాలు..హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్..ఇక ఇలాంటి జాతర లాంటి పండుగ ఉంది.

ఈ క్రమంలోనే సంక్రాంతికి నాలుగు స్ట్రెయిట్ మూవీస్ థియేటర్లలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. వీటికే థియేటర్లు దొరకక మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో మూవీస్ తెరకెక్కించనప్పటికీ..రిలీజ్ సమయానికి థియేటర్లు దొరక్కపోవడంతో ఎవ్వరి ప్రయత్నంలో వారున్నారు.

అంతే కాదండోయ్ ఇప్పటికీ తెలుగు సినిమాలే వస్తున్నాయి అనుకుంటే..వీటితో పాటుగా రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతికే వస్తున్నట్లు డేట్స్ ప్రకటించాయి. అలా జనవరి 12న ధనుష్ కెప్టెన్ మిల్లర్(Captain Miller),  శివ కార్తికేయన్ అయలాన్(Ayalaan) సినిమాలు రిలీజ్ చేస్తునట్టు మేకర్స్ ప్రకటించారు. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..అయలాన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు వాయిదా పడినట్లు సమాచారం. థియటర్ల కొరత ఉండటంతోనే తెలుగు వెర్షన్ లో రిలీజ్ వాయిదా పడగా..తమిళ వెర్షన్ లో యథావిధిగా రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే రవితేజ ఈగల్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలను నైజాం, వైజాగ్‌లో నిర్మాత దిల్‌ రాజు డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. సీడెడ్‌లో ఎన్‌.వీ ప్రసాద్‌, వెస్ట్‌ ఉషా పిక్చర్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఇక నిజానికి అయా ఏరియాల్లో వీరందరూ కూడా స్ట్రాంగ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌గా మంచి గుర్తింపు ఉంది. త్వరలో ఈ సినిమాల కొత్త డేట్స్ ని తెలిపే అవకాశం ఉంది.