Captain Miller Movie: కెప్టెన్‌ మిల్లర్‌ తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది..ధనుష్ ఫ్యాన్స్ గెట్ రెడీ

Captain Miller Movie: కెప్టెన్‌ మిల్లర్‌ తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది..ధనుష్ ఫ్యాన్స్ గెట్ రెడీ

కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush)హీరోగా నటిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్‌‌‌‌‌‌‌‌’( Captain Miller). తన కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే హయ్యస్ట్ బడ్జెట్‌‌‌‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే టీజర్‌‌‌‌‌‌‌‌,ట్రైలర్ తో ఆడియాన్స్ ను ఇంప్రెస్ చేశారు మేకర్స్. 

పాన్ ఇండియా వైడ్గా వస్తోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 12న) తమిళ వెర్షన్ థియేటర్‌లోకి వచ్చేసింది. కానీ, తెలుగులో మాత్రమే రీలీజ్ కాలేదు. దీనికి కారణం లేకపోలేదు. టాలీవుడ్లో సంక్రాంతికి వచ్చే సినిమాల లిస్ట్ పెద్దగానే ఉంది..అందులో పండగ బరిలో నిలిచింది పెద్ద స్టార్స్. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయలేదు. 

ఇక లేటెస్ట్గా తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న ‘కెప్టెన్ మిల్లర్‌‌‌‌‌‌‌‌ ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. తెలుగులో ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌, ఏషియన్‌ సినిమాస్‌ వారు రిలీజ్ చేయనున్నారు.

1930 - 40 లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ ఇంపార్టెంట్ రోల్స్ చేశారు.ప్రియాంక అరుళ్ మోహన్‌‌‌‌ హీరోయిన్ గా నటించింది. టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.