కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న 55వ చిత్రం 'ఓం' నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన తొలి పాట మంచి స్పందన తెచ్చుకోగా.. లేటెస్ట్ గా రెండో సింగిల్ ' వీర వీర' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ దృష్టిని తెగ ఆకర్షిస్తోంది. అసలు ఈ పాట సినిమాలో ఎలాంటి సందర్భంలో వస్తుంది? ధనుష్ పాత్ర ఎలా ఉండబోతోంది? అనే ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
'వీర వీర' తో గూస్ బంప్స్..
ధనుష్ కెరీర్లో 55వ చిత్రంగా తెరకెక్కుతున్న 'ఓం'కు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్‌కు చెందిన వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్టెక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'అలక్కా లోవా' తొలి పాట శ్రోతలను ఆకట్టుకుంది. ఆ తర్వాత మమ్ముట్టి గ్లింప్స్ వీడియో కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
ఇప్పుడు రెండో పాట 'వీర వీర' పవర్ఫుల్ బీట్స్, వినూత్నమైన మ్యూజిక్‌తో రూపొందిన ఈ పాట ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. అరుణ్ శ్రీనివాసన్ సాహిత్యం అందించిన ఈ పాటను సాయి అభ్యంకర్, తిప్పు ఆలపించారు. సంగీతం, గాత్రం కలిసిన ఈ పాట సినిమాపై అంచనాలను పెంచే మరో ప్రయత్నంగా నిలుస్తోంది. ముఖ్యంగా సాయి అభ్యంకర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా మారనుంది.
కొత్త డేట్ ఫిక్స్..
'ఓం' చిత్రం తొలుత అక్టోబర్ 16న థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే ఇతర చిత్రాల విడుదల షెడ్యూల్ కారణంగా వాయిదా పడింది. లేటెస్ట్ గా ఈ సినిమాను నవంబర్ 20న విడుదల చేయాలని నిర్ణయించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో ధనుష్‌తో పాటు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుందనే టాక్ ఉంది. గ్లామర్ డాల్ శ్రీలీల మరో హీరోయిన్గా నటిస్తోంది.
మొత్తానికి, పాటలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న 'ఓం' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ధనుష్ నటన, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం, సాయి అభ్యంకర్ సంగీతం కలిసి ఎలాంటి అనుభూతిని అందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
