ఇళయరాజాగా ధనుష్

ఇళయరాజాగా ధనుష్

ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు ధనుష్. ఇప్పుడు ఓ రియల్‌‌ లైఫ్‌‌ క్యారెక్టర్‌‌‌‌ను అతను పోషించబోతున్నాడు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాత్రలో ధనుష్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా గురించి కొన్ని రోజులుగా ప్రచారంలో ఉండగా, శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఇళయరాజా జీవితం ఆధారంగా కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంస్థలు సంస్థ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. 

ఈ బయోపిక్ షూటింగ్ అక్టోబర్ 2024లో ప్రారంభమై 2025 మధ్యలో విడుదల చేయనున్నట్టు టీమ్ తెలియజేసింది.   ఒక సామాన్యుడిగా మొదలై.. తన సంగీతంతో కోట్లాదిమందిని అభిమానులుగా చేసుకున్న మ్యూజిక్ మ్యాస్ట్రో జీవితంలో ఎంతో సంఘర్షణ ఉంది. అదంతా తెరపై చూడాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు.