పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా 'ధర్మస్థల నియోజకవర్గం' ట్రైలర్ రిలీజ్.. థియేటర్లలోకి ఎంట్రీ ఎప్పుడంటే?

పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా 'ధర్మస్థల నియోజకవర్గం' ట్రైలర్ రిలీజ్.. థియేటర్లలోకి ఎంట్రీ ఎప్పుడంటే?

వరల్డ్ వైడ్ ఫిలిం సర్కిల్స్ లో పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ల క్రేజ్ వేరు. ఇప్పుడు అదే జోనర్ లో మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మించిన చిత్రం 'ధర్మస్థల నియోజకవర్గం'.  ఈ  పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రానికి జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు.  సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న సందర్భంగా హైదరాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు  మేకర్స్.

ఈ సందర్భంగా ఆస్కార్ విజేత, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. రంగస్థలం చిత్రం తర్వాత మళ్లీ నాకు అంతటి ఆత్మసంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చిన సినిమా ఇది. భిన్నమైన సన్నివేశాలకు వినూత్నమైన సాహిత్యం అందించే లక్కీ ఛాన్స్ దక్కింది. నా పాటలకు సంగీత దర్శకుడు మహావీర్ ఏలేందర్ అద్భుతమైన స్వరాలతో ప్రాణం పోశారు. ప్రతిఘటనలో విజయశాంతి తరహాలోనే వితికా షేరుకు ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ లభించింది అని వ్యాఖ్యానించారు. నటుడు నటరాజ్ , శివకుమార్ కూడా దర్శకుడి మేకింగ్ స్టైల్‌ను, సినిమా అవుట్‌పుట్‌ను ప్రశంసించారు.

చంద్రబోస్ గారి సాహిత్యం నచ్చడంతోనే ఈ సినిమా ఒప్పుకున్నానని, తన కెరీర్ లో ఇదొక మైలురాయిలా నిలుస్తుందని  హీరోయిన్ వితికా షేరు ధీమా వ్యక్తం చేశారు. ఇక దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట కేవలం 45 రోజుల్లోనే ప్యాచ్ వర్క్ సహా షూటింగ్ పూర్తి చేసి, ప్రొడ్యూసర్ మేరుం భాస్కర్ సహకారంతో ఔట్ పుట్ అద్భుతంగా రాబట్టారని చిత్రబృందం కొనియాడింది. సంగీత దర్శకుడు మహావీర్ ఏలేందర్ అందించిన 5 విభిన్నమైన పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, పృథ్వి వంటి దిగ్గజ తారాగణంతో పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొంది తీరుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. సెప్టెంబర్ 4న బాక్సాఫీస్ వద్ద ఈ 'ధర్మస్థల నియోజకవర్గం' ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి..