‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాటను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, ఆస్కార్ అవార్డు గ్రహీత, గేయ రచయిత చంద్రబోస్ కలిసి విడుదల చేసి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరారు. నటరాజ్, రాయంచ కొక్కుర, సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, వితిక షేరు, వరుణ్ సందేశ్, కాలకేయ ప్రభాకర్, షఫీ, ఛత్రపతి శేఖర్, ఐ డ్రీమ్ అంజలి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తుండగా, మెరుం భాస్కర్ నిర్మిస్తున్నారు.
ఈ సాంగ్‌లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ ‘మా సాంగ్ రిలీజ్ చేసిన క్రిష్ గారికి, చంద్రబోస్ గారికి థ్యాంక్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం. ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
