Dhurandhar 2 OTT Release : ఓటీటీలోకి వచ్చేసిన ‘ధురంధర్ 2’.. థియేటర్లలో మిస్సైన సీన్లతో గూస్‌బంప్స్!

Dhurandhar 2 OTT Release : ఓటీటీలోకి వచ్చేసిన ‘ధురంధర్ 2’.. థియేటర్లలో మిస్సైన సీన్లతో గూస్‌బంప్స్!

బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar 2) ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్‌పై ఊచకోత కోయడానికి వచ్చేసింది. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ హై-వోల్టేజ్ మూవీ థియేటర్లలో ఏకంగా రూ. 1,800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచింది.

స్పెషల్ డిజిటల్ ప్రీమియర్‌తో రిలీజ్..

థియేటర్లలో ఈ యాక్షన్ విజువల్ వండర్‌ను మిస్ అయిన ఫ్యాన్స్ కోసం ఇప్పుడు డబుల్ ట్రీట్ సిద్ధమైంది. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ జియో హాట్ స్టార్ ( JioHotstar ) ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ఈ రోజు సాయంత్రం 7 గంటలకే స్పెషల్ డిజిటల్ ప్రీమియర్‌తో గ్రాండ్‌గా ల్యాండ్ అయింది.  జూన్ 5 నుండి దీని రెగ్యులర్ స్ట్రీమింగ్ షురూ కానుంది. కేవలం హిందీలోనే కాదు... తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది..

థియేటర్ వర్షన్ వేరు.. 'రా & ఉందేఖా' వర్షన్ వేరు!

అయితే ఇది మామూలు ఓటీటీ రిలీజ్ కాదు బాస్ అంటూ స్ట్రీమింగ్ అవుతోంది.. థియేటర్లలో చూసిన వాళ్లు కూడా మైండ్ బ్లోయింగ్ అయ్యేలా 'Dhurandhar: The Revenge – Raw & Undekha" పేరుతో అన్‌కట్ ఎక్స్‌టెండెడ్ వర్షన్‌ను రిలీజ్ చేశారు. సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల థియేటర్లలో ట్రిమ్ చేసిన అత్యంత క్రూరమైన, వయొలెంట్ సీన్స్ ఇందులో యాడ్ చేశారు. ముఖ్యంగా భీభత్సమైన 'ల్యారీ గ్యాంగ్ వార్' సీక్వెన్స్, హై-వోల్టేజ్ రా కంబాట్ సీన్స్ ఇప్పుడు మరింత వైల్డ్‌గా ఉన్నాయి.. 

గూస్‌బంప్స్ గ్యారెంటీ!

థియేటర్లలో మ్యూట్ పడిన రఫ్‌ అండ్ టఫ్ డైలాగ్స్, కట్ చేసిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ఇప్పుడు ఓటీటీ వర్షన్‌లో అన్‌సెన్సార్‌డ్‌గా ఒరిజినల్ టోన్‌తో వినిపిస్తున్నాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. పిందా మరణం తర్వాత జస్కీరత్ ఇచ్చే ఎమోషనల్ రియాక్షన్‌తో కూడిన కొన్ని మైండ్ బ్లోయింగ్ సీన్స్ కూడా ఇందులో జోడించారు.  సినీ ప్రియులకు గూస్ బంప్స్ తెప్పించేలా సీన్స్ జోడించారు.  మొత్తం 3 గంటల 52 నిమిషాలతో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.

అదిరిపోయే కాస్టింగ్..
రణ్‌వీర్ సింగ్ 'హమ్జా అలీ మజారీ' అనే పవర్‌ఫుల్ స్పై క్యారెక్టర్‌లో వన్‌మ్యాన్ షో చేశారు.. సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, రాకేష్ బేడీ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమయ్యారు. ఇంటర్నేషనల్ కాన్‌స్పిరసీ, మైండ్ గేమ్‌లు, అదిరిపోయే లొకేషన్లు, గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ సీక్వెల్ స్పై యూనివర్స్‌ను నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లింది.

ఎక్స్‌క్లూజివ్ మేకింగ్ వీడియోలు, బిహైండ్ ది సీన్స్, కాస్ట్ ఇంటర్వ్యూలతో వచ్చిన ఈ థ్రిల్లింగ్ రైడ్‌ను అస్సలు మిస్ అవ్వకండి. మీ హోమ్ థియేటర్లలో సౌండ్ పెంచి, ఈ వీకెండ్‌కు 'ధురంధర్ 2' వైల్డ్ యాక్షన్‌ను ఎంజాయ్ చేయండి. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ మూవీ డిజిటల్ ధునియాలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.