Dhurandhar 2 OTT release: రణవీర్ సింగ్ ‘ధురందర్ 2’ OTT రచ్చ.. జియో హాట్‌స్టార్‌కు నెట్‌ఫ్లిక్స్ ఊహించని షాక్!

Dhurandhar 2 OTT release: రణవీర్ సింగ్ ‘ధురందర్ 2’ OTT రచ్చ.. జియో హాట్‌స్టార్‌కు నెట్‌ఫ్లిక్స్ ఊహించని షాక్!

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ 'ధురందర్: ది రివెంజ్' (Dhurandhar: The Revenge).  బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ మూవీ దాదాపు రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ధునియాలో సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోంది. 

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇండియాలో ఈ సినిమా డిజిటల్ రైట్స్ జియో హాట్ స్టార్ దక్కించుకుంది. లేటెస్ట్ గా  OTT రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ చేసింది. జూన్ 4, 2026 నుండి ఇండియాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ యాక్షన్ డ్రామా.. OTTలో ఏకంగా 3 గంటల 52 నిమిషాల భారీ రన్‌టైమ్‌తో రాబోతోంది. ఇది థియేటర్ వర్షన్ కంటే అదనపు సీన్లతో కూడిన స్పెషల్ ఎక్స్‌టెండెడ్ ఎడిషన్ కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

నెట్‌ఫ్లిక్స్ గేమ్‌ప్లాన్!

అయితే ఐపీఎల్ (IPL) హడావుడి వల్ల వ్యూయర్‌షిప్ తగ్గుతుందేమోనని భయపడి జియో హాట్‌స్టార్ జూన్ వరకు ఆగింది. కానీ, ఇదే గ్యాప్‌లో గ్లోబల్ OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఊహించని మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. ఇండియా మినహా మిగతా ప్రపంచవ్యాప్తంగా ‘ధురందర్ 2’ రా అండ్ అన్‌కట్ (Raw and Uncut) వర్షన్‌ను మే 15 నుంచే మల్టీ లాంగ్వేజెస్‌లో స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించింది. ఇండియాలో సెన్సార్ కత్తెర పడిన రణవీర్ సింగ్ వైల్డ్ అండ్ గ్రిట్టీ పర్ఫార్మెన్స్ సీన్స్, ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్, అన్‌సెన్సార్డ్ డైలాగ్స్ అన్నీ ఈ ఇంటర్నేషనల్ కట్‌లో ఉన్నాయి. దాంతో, మన ఇండియన్ ఆడియన్స్ ఊరుకుంటారా? అఫీషియల్ రిలీజ్ కోసం జూన్ 4 వరకు ఆగలేక.. అప్పుడే VPNలు వాడి, పైరసీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ లింకుల ద్వారా ఈ అన్‌కట్ వర్షన్‌ను తెగ చూసేస్తున్నారు.

లీకుల బెడద..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ధురందర్ 2’ అన్‌కట్ సీన్స్, రణవీర్ రాంపేజ్ క్లిప్స్ విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. సినిమాలోని బెస్ట్ మూమెంట్స్ అన్నీ ఇప్పుడే లీక్ అయిపోతుండటంతో, జూన్ 4న వచ్చే అఫీషియల్ రిలీజ్‌పై హైప్ తగ్గుతుందేమోనన్న ఆందోళన ట్రేడ్ వర్గాల్లో మొదలైంది. ఐపీఎల్‌ను తప్పించుకోబోయి.. పైరసీకి, స్పాయిలర్లకు జియో హాట్‌స్టార్ రెడ్ కార్పెట్ పరిచినట్లయిందనే టాక్ నడుస్తోంది.  

గ్లోబల్ రిలీజ్ వర్సెస్ రీజినల్ రైట్స్ మధ్య నలిగిపోతున్న క్రేజీ కంటెంట్ ఇదొక్కటే కాదు, కానీ ‘ధురందర్’ విషయంలో జియో హాట్‌స్టార్‌కు గట్టి సవాలే ఎదురైంది. దాదాపు నాలుగు గంటల అల్టిమేట్ ఎక్స్‌పీరియన్స్‌తో ఇండియాలో రికార్డు వ్యూస్ సాధించాలని చూస్తున్న జియో హాట్‌స్టార్ ప్లాన్‌ను.. నెట్‌ఫ్లిక్స్ అన్‌కట్ వర్షన్ దెబ్బకొడుతుందా? లేదా రణవీర్ సింగ్ మాస్ మానియాతో జూన్ 4న హాట్‌స్టార్ సర్వర్లు క్రాష్ అవుతాయా? అనేది చూడాలి మరి.