Dhurandhar 2 Collections: బాక్సాఫీస్ దద్దరిల్లేలా ‘ధురంధర్ 2’ కలెక్షన్లు.. 4 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Dhurandhar 2 Collections: బాక్సాఫీస్ దద్దరిల్లేలా ‘ధురంధర్ 2’ కలెక్షన్లు.. 4 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

రణ్‌‌వీర్ సింగ్‌‌ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్‌‌‌‌: ది రివేంజ్‌‌’ చిత్రం ఇటీవల విడుదలై  బాక్సాఫీస్  వద్ద రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల క్లబ్‌‌లో చేరిన ఈ చిత్రం, భారీ వసూళ్లు సాధించింది.

ఇండియన్ సినిమాలో అతి తక్కువ టైమ్‌‌లో  ఈ స్థాయిలో వసూళ్లు చేసిన మూడో చిత్రంగా ఇది నిలిచింది. ఆదివారం (మార్చి 22న) వీకెండ్ తోడవ్వడంతో ఏకంగా అత్యధికంగా రూ.115 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే నాలుగు రోజుల్లోనే ‘ధురంధర్ 2’ ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్ల (గ్రాస్), రూ.400 కోట్ల నెట్  కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వీకెండ్ వసూళ్లతో పలు ఇండియన్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసేసింది.

ధురంధర్ 2 రికార్డ్స్:

బాహుబలి2, పుష్ప2 తర్వాత మూడు రోజుల్లో రూ.500 కోట్లు రాబట్టిన చిత్రమిది. ఈ మూడూ సీక్వెల్స్ కావడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలైన ‘ధురంధర్ 2’ పాజిటివ్ టాక్‌‌తో వీకెండ్‌‌లో మరిన్ని వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ లో ఇప్పటివరకు ఉన్న షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ రూ. 287 కోట్ల ఓపెనింగ్ వీకెండ్ రికార్డును ‘ధురంధర్ 2’బ్రేక్ చేసేసింది. అలాగే, ‘పఠాన్’ ఐదు రోజుల్లో సాధించిన మార్కును సైతం ధురంధర్ 2 కేవలం నాలుగు రోజుల్లోనే అధిగమించింది. 

టాలీవుడ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇండియాన్ సినీ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ సాధించిన మొదటి చిత్రం పుష్ప2. ఆ తర్వాత రెండో చిత్రంగా ‘ధురంధర్ 2’ నిలిచింది. ఇంతకు ముందు 2, 3 స్థానాలలో ఉన్న‘బాహుబలి 2’ (రూ.591 కోట్లు), ‘కల్కి 2898 AD’ (రూ.500 కోట్లు), RRR (రూ.470 కోట్లు) వంటి భారీ పాన్ ఇండియా తెలుగు సినిమాల రికార్డులను సైతం అధిగమించింది.

ఇకపోతే, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ధురంధర్ 2 హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు నార్త్ అమెరికా, UK వంటి పలు దేశాల్లో కలుపుకుని దాదాపు రూ.180 కోట్లు వసూళ్లతో దూసుకుపోతుంది. దీంతో ఈ చిత్రంపై బాలీవుడ్‌‌తోపాటు టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మొదటి పార్ట్  ‘ధురంధర్ 1’ బాక్సాఫీస్ దగ్గర రూ.1350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించగా, సెకండ్ పార్ట్‌‌కు మరింత క్రేజ్‌‌ రావడంతో ఆ రికార్డును అతి తక్కువ రోజుల్లోనే అధిగమించేలా కనిపిస్తోంది. ఇంకో రెండు రోజుల్లో  ‘ధురంధర్ 2’ వెయ్యి కోట్లు సాధించి.. లాంగ్ రన్ లో 2 వేల కోట్ల దిశగా దూసుకెళ్లనుంది.