పండుగ పూట 'తినొద్దు' అనుకున్నా కూడా స్వీట్లు, పిండివంటలు తినేస్తారు చాలామంది. దాంతో డైట్ ప్లాన్ దెబ్బతింటుంది. ఇంకేముంది బాడీ డల్ గా అవుతుంది. అలాంటప్పుడు డీటాక్స్ డ్రింక్స్ తాగితే యాక్టివ్ అవుతారు. వీటిని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.
*కప్పు నీళ్లలో కొంచెం పసుపు, అల్లం, నల్లమిరియాల పొడి, తేనె వేయాలి. ఈ నీళ్లని మరిగిస్తే పసుపు టీ రెడీ. ఈ టీ టాక్సిన్లని తొలగిస్తుంది. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ ఫ్లమేటరీ గుణాలు జీర్ణక్రియలు సరిగా జరిగేలా చేస్తాయి.
*నిమ్మరసం, అల్లం, తేనె కలిపి తయారుచేసిన టీని ఉదయాన్నే తాగాలి. ఈ టీ తాగితే మెటబాలిజం స్పీడ్ గా జరుగుతుంది.
*డీటాక్స్ పాటు రీ-హైడ్రేషన్ కోసం కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పుదీనా కలిపిన డ్రింక్ తాగాలి. కొబ్బరినీళ్లు శక్తినిస్తాయి. నిమ్మరసం, పుదీనా ఒంట్లోని మలినాల్ని పోగొడతాయి.
*తాజా కమలా, అల్లం, క్యారెట్లని మిక్సీలో గ్రైండ్ చేసి జ్యూస్ తీయాలి. ఈ జ్యూస్లో ఉండే విటమిన్-సి, బీటా-కెరొటిన్, ఫైబర్ లు ఉంటాయి. ఇవి శరీరాన్ని డీటాక్స్ చేయటంతో పాటు జీర్ణక్రియల్ని మెరుగుపరుస్తాయి.
*సరిగ్గా జీర్ణం కావాలంటే దానిమ్మ, బీట్రూట్ జ్యూస్ తాగాలి. ఈ జ్యూస్ శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది కూడా.
