థెమిస్టో డిజిటల్ హైగ్రోమీటర్ థర్మామీటర్ గదిలోని ఉష్ణోగ్రత, తేమ శాతాన్ని కొలిచి చూపిస్తుంది. ఇళ్లు, ఆఫీసులు, గ్రీన్‌హౌస్‌లు, ల్యాబ్‌లలో వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అడ్వాన్స్డ్ సెన్సర్లతో పనిచేసే ఈ డివైజ్ కచ్చితమైన రీడింగ్స్ ఇస్తుంది.
పెద్ద ఎల్‌సీడీ స్క్రీన్ ఉండటంతో వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మైనస్10 నుంచి50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను, 10 నుంచి 99 శాతం వరకు తేమను కొలవగలదు. చిన్న బ్యాటరీతో పనిచేసే ఈ మీటర్ అగ్గిపెట్టె సైజ్‌లో ఉంటుంది. దీన్ని టేబుల్‌పై పెట్టుకోవచ్చు. గోడకు లేదా కార్ డ్యాష్‌బోర్డ్‌కు అమర్చుకోవచ్చు. పిల్లలు, వృద్ధులు ఉన్న గదుల్లో వాతావరణం సౌకర్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
