నాని శనివారం అప్‌‌డేట్.. దిల్ రాజు చేతికి డిస్ట్రిబ్యూషన్

నాని శనివారం అప్‌‌డేట్..  దిల్ రాజు చేతికి డిస్ట్రిబ్యూషన్

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిపోదా శనివారం.  పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి తాజాగా రెండు అప్‌‌డేట్స్‌‌ను ప్రకటించారు మేకర్స్. అందులో ఒకటి.. ఈ మూవీ ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్‌‌ను దిల్ రాజుకు చెందిన ఎస్‌‌వీసీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సొంతం చేసుకున్నట్టు తెలియజేశారు. అలాగే  యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న ఎస్‌‌.జె.సూర్య సెట్స్‌‌లో జాయిన్‌‌ అయ్యాడని తెలిపారు.

ఆయన పాత్ర డైనమిక్‌‌గా ఉండబోతోందని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ‘అన్‌‌చెయిన్డ్’ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  నాని రగ్గడ్ అండ్ ఇంటెన్స్ లుక్‌‌లో కనిపించనున్నాడు.  ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌‌గా నటిస్తోంది.  డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి కలిసి హై బడ్జెట్‌‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ‘అంటే సుందరానికీ’ తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.