లైకా ప్రొడక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లూసిఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‑2

లైకా ప్రొడక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లూసిఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‑2

మలయాళ సూపర్ స్టార్ మోహ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ లాల్ హీరోగా వచ్చిన ‘లూసిఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ సినిమా అక్కడ ఘన విజయాన్ని అందుకుంది. పృథ్విరాజ్ సుకుమారన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ఈ చిత్రానికి కొన్ని రోజుల క్రితం ప్రీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2: ఎంపురాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన టీమ్ తాజాగా ప్రీ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా పూర్తి చేసింది.

అక్టోబర్ 5 నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ మలయాళ ఎంట్రీ ఇస్తుంది. తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే లైకా ప్రొడక్షన్.. ఆశీర్వాద్ సినిమాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి  ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ 5న  ఢిల్లీలో షూటింగ్ ప్రారంభించి.. తర్వాత లడఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షెడ్యూల్ ప్లాన్ చేశారు. మరోవైపు మోహన్ లాల్ ఓ క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నట్టు శనివారం అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వచ్చింది.

మంచు విష్ణు నిర్మిస్తున్న ‘భక్త కన్నప్ప’లో మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోను విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో ప్రభాస్, నయనతార వంటి స్టార్స్ నటిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మహాభారతం సీరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దర్శకత్వం వహించిన ముఖేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్రానికి రచయితలుగా పని చేస్తున్నారు.