మరో చంటబ్బాయి రాబోతుంది.. మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ

మరో చంటబ్బాయి రాబోతుంది.. మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తన సినీ కెరీర్ లో చేయని పాత్రంటూ లేదు కానీ.. ఆయన డిటెక్టీవ్ గా చేసిన చంటబ్బాయి సినిమా చాలా ప్రత్యేకం. 1986లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు చాలా మంది అభిమానూలు ఉన్నారు. ఇప్పటికి టీవీలో వచ్చినా చూసే వాళ్లు చాలామంది ఉన్నారు. అంతలా ఆ సినిమా ప్రేక్షకుల మనసులు దోచేసుకుంది. 

అయితే చిరంజీవి మరోసారి ఇలాంటి సినిమా చేస్తే చూడాలి అని మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ వెయిటింగ్ కు పులిష్టాప్ పెడుతూ.. అలాంటి ఒక సినిమా చేయనున్నారట మెగాస్టార్. అవును ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. టాలెంటెడ్ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారట. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై కథా చర్చలు జరిగాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. 

ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో కెమెడీ చిత్రాలకు కేరాఫ్ గా మారిపోయారు దర్శకుడు అనిల్ రావిపూడి. అటు చిరంజీవి కూడా చంటబ్బాయి తన ఫెవరేట్ మూవీ అని చాలా సార్లు ఓపెన్ గానే చెప్పేశారు. దీంతో ఈ కాంబోలో మరోసారి చంటబ్బాయి  లాంటి మూవీ వస్తే ఆ రిజల్ట్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి ఈ కాంబోలో సినిమా ఎప్పుడు మొదలువుతుందో? ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.