మెగాస్టార్తో మరో సినిమా.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

మెగాస్టార్తో మరో సినిమా.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

గత సంక్రాంతికి వచ్చి భారీ విజయాన్ని సాధించిన మూవీ వాల్తేరు వీరయ్య(Valteru Veerayya). మెగాస్టార్ చిరంజీవి(Megastar) హీరోగా దర్శకుడు బాబీ(Bobby) తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ భారీ విజయాన్ని సాధించింది. ముందు నుండే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి మాస్ ప్రెజెంటేషన్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ వెరసి సినిమాను నెక్స్ట్ లెవల్లో  నిలబెట్టింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.108 కోట్ల గాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా రూ.236 కోట్ల రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. 

ఇక తాజాగా వాల్తేరు వీరయ్య మూవీ 365 రోజులను కంప్లీట్ చేసుకుంది. ఏపీలోని అవనిగడ్డ రామకృష్ణా థియేటర్‌లో రోజుకు నాలుగు షోలతో ప్రదర్షింపబడుతూ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది వాల్తేర్‌ వీరయ్య. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి వాయిస్ నోట్ ను కూడా రిలీజ్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అవనిగడ్డ రామకృష్ణా థియేటర్‌ దగ్గర సంబరాలు కూడా జరుపుకున్నారు. ఈ వేడుకకు వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ హాజరయ్యారు.చిరంజీవి గురించి, సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక అభిమానిగా చిరంజీవి సినిమాకు దర్శకత్వం వచించడం అనేది జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని, త్వరలోనే మెగాస్టార్ తో మళ్ళీ సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు.

దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చేయన్నా, వాల్తేరు వీరయ్యను మించిన సినిమా చేయన్నా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే.. ఈ సినిమాలో చిరంజీవి తమ్ముడిగా మాస్ మహారాజ రవితేజ నటించారు. ఈ ఇద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కు ఆడియన్స్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. మెగాస్టార్ జోడీగా శృతి హాసన్ నటించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించారు.