అఖండ 2 కోసం పవర్ఫుల్ కథ.. ఎక్కడ ముగించారో అక్కడే మొదలు!

అఖండ 2 కోసం పవర్ఫుల్ కథ.. ఎక్కడ ముగించారో అక్కడే మొదలు!

అఖండ(Akhanda).. నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu) తెరకెక్కించిన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ అఘోరా గా కనిపించిన ఈ సినిమా ఆడియన్స్ మైండ్ బ్లాంక్ చేసింది. సినిమాలోని మాస్ ఎలిమెంట్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ కు మాస్ ప్రేక్షకులు శివాలెత్తిపోయారు. ఆ యాక్షన్ సీక్వెన్స్ కు తమన్ అందించిన బీజీఎమ్ కు థియేటర్స్ బద్దలైపోయాయి. స్క్రీన్ పై బాలయ్య చేసిన మాస్ జాతరకు బాక్సాఫిస్ దగ్గర కాసుల వర్షం కురిసింది.

ఇక ఈ సినిమా సాధించిన అఖండ విజయంతో.. అఖండ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు బోయపాటి. అప్పటినుండి అఖండ సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా సమాచారం ప్రకారం బోయపాటి తన తరువాతి సినిమాగా అఖండ2 ను తెరకెక్కించాలని ఫిక్స్ ఆయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కు సంబందించిన కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. ఇక అఖండ సినిమా ఎక్కడ ఎండ్ అయ్యిందో అక్కడే ఈ సీక్వెల్ కథ మొదలవుతుందని బోయపాటి ఇప్పటికే చెప్పేశారు. దాంతో ఈ సినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఈసారి పాన్ ఇండియా లెవల్లో తన మాస్ ప్రతాపాన్ని చూపించడానికి ప్లాన్ చేస్తున్నాడట. 

ఇదిలా ఉంటే.. గీత ఆర్ట్స్ లో కూడా బోయపాటి ఒక సినిమా చేసేందుకు ఒప్పుకుకున్నారు. ఈ విషయంపై నిర్మాత అల్లు అరవింద్ కూడా ఓపెన్ గానే కామెంట్స్ చేశారు. దీంతో పుష్ప2 తరువాత అల్లు అర్జున్ బోయపాటితో సినిమా చేయనున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి      . కానీ.. అల్లు అర్జున్ పుష్ప2 తరువాత సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట. కాబట్టి బోయపాటి అఖండ2 ను తెరకెక్కించే పనిలో పడ్డారట. కానీ ఎప్పటి నుండి షూటింగ్ మొదలుకానుంది అనే విషయం మాత్రం ఇప్పటికే సస్పెన్స్ గానే ఉంది. మరి అవుట్ అండ్ అవుట్ మాస్ కాంబోలో రానున్న అఖండ2 ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.