‘ఆయా షేర్’ తర్వాత జంగిరెడ్డి మరో మాస్ సాంగ్.. బుచ్చిబాబు చేతుల మీదుగా లాంచ్

‘ఆయా షేర్’ తర్వాత జంగిరెడ్డి మరో మాస్ సాంగ్.. బుచ్చిబాబు చేతుల మీదుగా లాంచ్

జయహో జనార్ధన సినిమాలోని హై-ఎనర్జిటిక్ సాంగ్ అయిన ‘చిందువేయవే చాందుక తుకడ’ పాటను పెద్ది సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సానా చేతుల మీదుగా విడుదల చేశారు. పానుగంటి ప్రొడక్షన్స్ పతాకంపై పానుగంటి శరత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ పాటకు నేషనల్ అవార్డ్ విన్నర్ సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా, నాని ప్యారడైజ్లో సూపర్ హిట్ ‘ఆయా షేర్’ పాట పాడిన జంగి రెడ్డి హుషారైన గొంతుతో పాడారు. చరణ్ అర్జున్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు.

ఈ మూవీలో నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు, BVM శివశంకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. ఈ సినిమాకి ఎడిటర్‌గా నందమూరి హరి, కెమెరామెన్గా విజయ్ ఠాగూర్, ఆర్ట్ డైరెక్టర్‌గా భూపతి యాదగిరి వ్యవహరిస్తున్నారు.

ఇటీవలే విజనరీ డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా ఈ సినిమా పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. లవ్, కమర్షియల్, కామెడీ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అండ్ ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రేక్షకులందరినీ అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మూవీ టీమ్ ఆశాభావం వ్యక్తం చేసింది.