Good Time: యూత్ పల్స్ పట్టుకున్న ‘గుడ్ టైమ్’.. దర్శకుడు సినిమా గురించి ఏమన్నారంటే?

Good Time: యూత్ పల్స్ పట్టుకున్న ‘గుడ్ టైమ్’.. దర్శకుడు  సినిమా గురించి ఏమన్నారంటే?

నిఖిల్ గాజుల, అన్యుక్త నలాని జంటగా నటించిన చిత్రం ‘గుడ్ టైమ్’. చాణక్య జిల్లా దర్శకత్వంలో రమేష్ జిల్లా నిర్మించారు. అక్టోబర్ 9న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు  దర్శకుడు అనిల్ విశ్వనాథ్, హీరోయిన్ కామాక్షి భాస్కర్ల  అతిథులుగా హాజరై ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుతూ టీమ్‌‌‌‌‌‌‌‌కు  బెస్ట్ విషెస్ అందించారు.

యూత్‌‌‌‌‌‌‌‌ను ఆకట్టుకునే ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తోపాటు ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేసేలా ఈ చిత్రం ఉంటుందని నిఖిల్ గాజుల అన్నాడు.  యూత్ ఆలోచనలు, వారి ప్రవర్తన, ఎమోషన్స్ ఎలా ఉంటాయో ఫన్నీగా ఈ సినిమాలో చూస్తారని హీరోయిన్ అన్యుక్త నలాని చెప్పింది. ఇదొక యూత్‌‌‌‌‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ అని  డైరెక్టర్ చాణక్య జిల్లా చెప్పాడు.  యువతకు రిలేట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత రమేష్ జిల్లా అన్నారు. టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.