Gunasekhar Euphoria: జానర్ మార్చిన గుణశేఖర్.. యుఫోరియాతో సరికొత్తగా

Gunasekhar Euphoria: జానర్ మార్చిన గుణశేఖర్.. యుఫోరియాతో సరికొత్తగా

శాకుంతలం(Shakunthalam) సినిమాతో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు గుణశేఖర్(Gunasekhar). స్టార్ బ్యూటీ సమంత(Samantha) హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా మినిమమ్ ఓపెనింగ్స్ ని కూడా రాబట్టలేక బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక అప్పటి నుండి గుణశేఖర్ తరువాతి సినిమాపై అనేక వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే.. రానాతో హిరణ్యకశ్యప సినిమాను చేస్తున్నాడనే వార్తలు వినిపించాయి. దాదాపు అదే కన్ఫర్మ్ అని అందరూ అనుకున్నారు. కానీ, అందరికీ షాకిస్తూ సరికొత్త సినిమాను మొదలుపెట్టాడు గుణశేఖర్. 

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చాడు. తన కొత్త సినిమాకు యుఫోరియ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. డిఫరెంట్, డిఫరెంట్ కలర్స్ తో వచ్చిన ఈ వీడియో ఆడియన్స్ కి సరికొత్త ఫీలింగ్ ని ఇచ్చింది. అంతేకాదు.. ఈ సినిమా కూడా డిఫరెంట్ కథతో రానుంది అనే విషయం కూడా క్లియర్ గా అర్థమవుతోంది. ఈ ఒక్క వీడియోతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు కూడా పెరుగుతున్నాయి. 

ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని ప్రకటించారు. అయితే.. ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, టెక్నీషియన్స్ విషయాలపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ విషయాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి జానర్ మార్చి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న గుణశేఖర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.